Breaking News

సివిల్స్ విజేతలకు సీఎం చంద్రబాబు అభినందన

cm chandra

నిన్న ప్రకటించిన 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మేటి ర్యాంకులు సాధించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ఇనుమడింపచేసిన సివిల్స్ తెలుగు ర్యాంకర్లను ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయకుడు ఒక ప్రకటనలో అభినందించారు. మొత్తం 1236 ర్యాంకుల్లో 75 అత్యుత్తమ ర్యాంకులను తెలుగు విద్యార్థులను సాధించడం గర్వకారణమన్నారు.

14వ ర్యాంకు సాధించిన సాకేత్ రాజా, 18వ ర్యాంకు సాయికాంత్ వర్మ, 21వ ర్యాంకు లక్ష్మీకాంత్ రెడ్డి, 30వ ర్యాంకు పోట్రుగౌతమ్, 44వ ర్యాంకు మహ్మద్ రోషన్, 66వ ర్యాంకు మైలవరపు కృష్ణతేజ, 88వ ర్యాంకు లక్ష్మీ భవ్య, 97వ ర్యాంకు సతీష్ రెడ్డితో పాటు మొత్తం 75 మంది ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులను రాష్ట్రప్రభుత్వం తరఫున సహకరిస్తామని చంద్రబాబు స్పష్ట చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *