సిరిస్ గెలవాలంటే!

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): భారత్-దక్షిణాఫ్రకా సిరిస్ లో మొదటి మ్యాచ్ లో వైఫల్యాల కారణంగా ఓడినప్పటికీ రెండో మ్యాచ్లో గెలిచి పట్టు బిగించాలని చూస్తోంది ఇండియా. ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ కు ఈ సిరిస్ ను కాపాడుకోవాలంటే రెండో మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి 1-0 తేడాతో ఉత్సాహంగా ఉన్న దక్షణాఫ్రికా జట్టు రెండో మ్యాచ్ కూడా గెలిచి టైటిల్ తమ ఖాతాలో వేసుకోవాలని వూహాలు రచిస్తోంది. అయితే ప్రత్యర్థి జట్టుకు అవకాశమివ్వకుండా భారత్ మరింత చురుకైన ఆట తీరునుకనబర్చేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా జట్టులో స్వల్ప మార్పులు చేస్తోంది. మొదటి మ్యాచ్ లో విఫలమైన బౌలర్ అక్షర్ పటేల్ స్థానంలో అమిత్ మిశ్రా లేదా హర్భజన్ సింగ్కు తుది జట్టులో చోటు లభించవచ్చు. అదే విధంగా ఒక వేళ రహానేకు స్థానం కల్పిస్తే రాయుడు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *