
సిరిసిల్ల ఆర్డీవోగా జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1995లో
తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్యామ్‌ప్రసాద్ గంభీరావుపేట, బోయినపల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, హుజురాబాద్, కరీంనగర్, కోరుట్ల తహసీల్దార్‌గా పని చేశారు. 2011లో డిప్యుటి కలెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యుటి కలెక్టర్‌గా, కరీంనగర్
పీఓఆర్‌ఎంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం శ్యామ్‌ప్రసాద్‌లాల్ బోధన్ ఆర్డీవోగా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరక ముందు ఈనాడు దిన పత్రికలో శ్యామ్ ప్రసాద్ జర్నలిస్టుగా పనిచేశారు.