Breaking News

సిరిసిల్లలో మాజీ కౌన్సిలర్ రాసలీలలు.?

masterpyce1A1

కరీంనగర్, ప్రతినిధి : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి ఆనుకొని ఉన్న తాడూర్ గ్రామ శివారు మానేరు వాగు తీరం.. బుధవారం రాత్రి.. చిమ్మ చీకటి వేళ ఒక జీపు వచ్చి ఆగింది. ఎంటీ ఇక్కడ జీపు ఆగిందని కొందరు గ్రామ యువకులు అక్కడికి వెళ్లి చూడగా.. ఫుల్లుగా మద్యం తాగిన మాజీ కౌన్సిలర్, అతడి ప్రియురాలైన ఓ మహిళ రాసలీలల్లో మునిగితేలుతున్నారు.

యువకులు చప్పుడు విన్న మాజీ కౌన్సిలర్ వెనక్కి తిరిగి చూడకుండా దొరకకుండా పారిపోయాడు. యువకులు పట్టుకుందామని ప్రయత్నించినా చిక్కలేదు. మద్యం మత్తులో ఉన్న మహిళ మాత్రం ఆ యువకులకు చిక్కింది. దీంతో యువకులు మహిళను.. వారు వచ్చిన జీపును పోలీసులకు అప్పగించారు. ఆమె వివరాలు తెలుసుకుని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు..

ప్రజాప్రతినిధి అయిన ఆ మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు ఒకరు ప్రస్తుతం కౌన్సిలర్ గా కొనసాగుతున్నారని సమాచారం. ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలా బహిరంగ రాసలీలలు జరుపడం సిరిసిల్ల పట్టణంలో సంచలనం సృష్టించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *