Breaking News

సిరిసిల్లలో ఎన్నాళ్లీ ఆకలి చావులు..

0111

– సిరిసిల్ల గాంధీజీ విగ్రహం ఎదుట నేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల : నేతల హామీలు బుట్టదాఖలవుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంకా నేతన్నల ఆకలిచావులు ఆగడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఓ నేత కార్మికుడు గాంధీజి విగ్రహం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. మేర్గు బాలరాజు (45) పవర్ లూం కార్మికుడు. వచ్చే జీతం సరిపోక.. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన బాలరాజు నిన్నరాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న మహాత్ముని విగ్రహం ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. స్థానికులు మంటలు ఆర్పినా అప్పటకే శరీరం పూర్తిగా కాలి చనిపోయాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *