
చెన్నై, ప్రతినిధి: సినీ రచయిత గణేష్ పాత్రో (74) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాత్రో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పాత్రో 100కు పైగా సినిమాలకు మాటలు రాశారు.
గణేష్ పాత్రో స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం.. ఆకలిరాజ్యం, తలంబ్రాలు సినిమాలకు మాటలు రాశారాయన.. ఇటీవల విడుదలైన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి రచయిత ఆయనే.. పావలా, కొడుకు పుట్టిన నాటికలతో ఆయన సంచలనం సృష్టించారు.