సినీలోకం: తమిళ విలాపం.. తెలుగు వికాసం

తమ సృజనాత్మకత సినిమాలతో దేశవ్యాప్తంగా హిట్ కొట్టిన తమిళ సినీ దర్శకులు ఇప్పుడు వెనుకబడ్డారు.. దిగ్గజ దర్శకుడు శంకర్ లాంటి వాళ్లు కూడా ‘ఐ’ సినిమాతో అట్టర్ ప్లాప్ నిచ్చాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.. ఇదే సమయంలో తెలుగు సినిమా ప్రభ ప్రపంచానికి చాటిచెప్పింది. జక్కన రాజమౌళి చెక్కిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. అంతేకాదు.. దీనికంటే ముందే చాలా తెలుగు సినిమాల రైట్స్ ను తీసుకొని బాలీవుడ్ అగ్రహీరోలందరూ రిమేక్ లు చేసి ఘన విజయాలు సాధించారు. తెలుగు దర్శకులను సైతం బాలీవుడ్ లో దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ సంవత్సర కాలంగా తమిళ దర్శకుల హవా తగ్గి.. తెలుగు ప్రతిభ వికసించిందనే చెప్పాలి..

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ అయితే మహేశ్ బాబు పోకిరీ, రవితేజ కిక్ లాంటి ఎన్నో తెలుగు సినిమాలను డబ్ చేసి విజయం పొందాడు.. మరో హీరో అక్షయ్ కూడా తెలుగు విక్రమార్కుడును హిందీలో  రిమేక్ చేసి హిట్ కొట్టాడు.. వీరే కాదు నవతరం హీరోలు కూడా తెలుగు హిట్ సినిమాల రైట్స్ కొని హిందీలో చేసి హిట్ కొట్టిన వారే.. ఇప్పుడు తెలుగు సినిమా అగ్రబాగాన ఉంది. తెలుగు నేటివిటీ.. తమిళంతో పోలిస్తే నీట్ గా ఉంటుంది. తమిళంలో కొంచెం వెగటు, ఓవర్ యాక్షన్, అసహజ నటన ఎక్కువగా ఉంటుంది. కానీ తెలుగు సినిమా ‘బొమ్మరిల్లు’ సినిమా వలే అనుబంధాల పల్లవిగా సాఫ్ట్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు హిందీ సినిమాల వాళ్లు తెలుగు సినిమా హిట్ అయితే చాలు కొనేందుకు ఎగబడుతున్నారంటే మన వాళ్ల ప్రతిభను అర్థం చేసుకోవచ్చు..

తమిళ శంకర్ ను దాటేసిన రాజమౌళి..

తమిళ నాటే కాదు దేశవ్యాప్తంగా వరుస  హిట్ సినిమాలు తీసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన దిగ్గజ దర్శకుడు శంకర్ రాజమౌళి కంటే వెనుకబడ్డాడు. రాజమౌళి బాహుబలి చేసిన మాయ ఇప్పుడు శంకర్ ను అథ పాతానికి పడేసింది. శంకర్ ఐ సినిమా ప్లాప్ కావడం.. బాహుబలి హిట్ కావడంతో వీరిద్దరి మధ్య పోటీ అనివార్యమైంది. ఇటీవల చైన్నై ఐఐటీ విద్యార్థులతో ఓ సమావేశం నిర్వహించింది యాజమాన్యం. దీనికి తమిళ దర్శకుడు శంకర్, తెలుగు దర్శకుడు రాజమౌళిలలో ఎవరిని గెస్ట్ గా పిలువాలో తెలపండని విద్యార్థులను అడిగితే వారు తమ భాష దర్శకుడని చూడకుండా రాజమౌళికే ఓటేశారు. రాజమౌళి సైతం ఐఐటీ లో తన ప్రసంగాన్ని ఇచ్చాడు.. అంతే సినీ ఇండస్ట్రీ అనేది హిట్ మీదే ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా హిట్ అయితే నే పేరు లేదంటే 20 సినిమాలు తీసిన శంకర్ అయినా ఒక్క హిట్ భారీ హిట్ కొట్టిన రాజమౌళి ముందు దిగదుడుపే అవుతాడు.. అందుకే శంకర్ కూడా ఈసారి రోబో-2తో తన స్టామినాను తిరిగి పొందాలని కసిగా రజినీకాంత్ తో సినిమా తీస్తున్నాడు. ఇది హిట్ తీసి రాజమౌళి కంటే ముందు నిలవాలని ఆరాటపడుతున్నాడు.. కాగా రాజమౌళి సైతం బాహుబలి 2తో బరిలో నిలవబోతున్నారు..దీంతో రోబో-2. బాహుబలి భవితవ్యం మీదే రాజమౌళి, శంకర్ లలో ఎవరు విజేతలు.. ఎవరిది ఫస్ట్ ప్లేసో ఖరారు కానుంది.. రోబో సినిమాలో శంకర్ పలికించిన ‘లోకం చాలా చిన్నది చిట్టీ’ అన్న డైలాగులో జయపాజయలే నిర్ణయించే సినీ ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *