సినిమా నిర్మాణానికి రుణ సౌకర్యం కల్పించాలి: రఫీ

కాన్న్స్ 2016 ఫిలిం ఫెస్టివల్ ప్రవేశానికి  ఇండియా నుండి అఫిస్యల్ గా స్క్రీనింగ్  కోసం 6 సినిమాలు మాత్రమే సెలక్ట్ ఐనప్పటికీ ఒక్కటి కూడా ప్రపంచస్థాయి పోటిలలో రాణించలేకపోయింది. తీసిన సినిమాలకు ఫెస్టివల్ ఎంట్రీ దొరకనప్పుడు, కొంతమంది కాన్న్స్ ఫిలిం మార్కెట్ కు డబ్బులు చెల్లించి, ఎంతో కర్చుపెట్టుకొని  ఎవరైనా  డిస్ట్రిబుటర్ దొరికితే సినిమాను అమ్ముకోవచ్చని ఆశతో వెళ్ళుతున్నారు . ఇటువంటి వాళ్లకు ఏమైనా వ్యాపారం జరిగితే పరువాలేదు లేకుంటే ఎంతో నష్టం జరుగుతుంది , ఎందుకంటె వీళ్ళకు ఫిలిం ఫెస్టివల్ పోటిలలో పాలుగొనే  అవకాశం కూడా ఉండదు కాబట్టి. సినిమా ఫెస్టివల్ లో పాలుగొంటెనేకదా బహుమతులు, ఇనాములు దొరికేవి ! ఆలాంటి ప్రతిష్టాత్మక పోటిల్లొ పాలుగొనాలంటె మన కేంద్ర ప్రభుత్వం ద్వార సెలెక్ట్ ఐతే తప్ప సాద్యం కాదు . కొన్ని దేశాలలో ఫిలిం ఫెస్టివల్ లు నిర్వహించడం , ఎంట్రీ ఫీజులు వసూళ్ళు చేయడం ఒక వ్యాపారంగా మారింది. కాన్న్స్ లాంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ పోటిల్లొ సెలెక్ట్  కానప్పుడు , ఇట్లాంటి ఎన్నో ఫెస్టివల్ లకు ఎంట్రీ ఫీజులు చెల్లించి, ఐడెన్టిటి కోసం తాపత్రయ పడి బుట్టల్లో పడేవారు కూడా ఉంటారు . ఇలాంటి  వారితోనే నిర్వాహకులకు ఆదాయం .మొట్టమొదలు సామాన్యులకు సినిమా తీయడమే  కష్టం, ఆపైన ఇలాంటి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లకు  ఫీజు కట్టి సినిమాలు దాఖలు చేయడం, రానుపోను ఖర్చు  పెట్టుకోవడం పెద్ద భారమే. కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో స్పోర్ట్స్ & గేమ్స్ లో రాణించే వారికి ఎలా ఐతే సహకారం అందిస్తుందో అలాగే ప్రపంచ సినిమాలతో పోటి పడే సినిమాల నిర్మాణానికి పెట్టుబడి , లేదా రుణ సౌకర్యమ్ , లేదా సహా నిర్మాణం చేసి ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది . వీలయితే మొదలే మంచి కథలను ఎంపిక చేసి, సాంకేతికంగా నాణ్యత తగ్గకుండా సినిమాలు రుపుదిద్దుకునేల నియమ నిబందనలు పెట్టి జాగ్రత్త వహిస్తే 2017 నాటికి మన రాష్ట్రము నుండి కూడా గొప్ప సినిమాలు నిర్మితమై ప్రపంచ సినిమాలతో పోటి పడి మన రాష్ట్రానికే కాదు దేశానికే పెరు ప్రఖ్యాతలు  తేచ్చి పెట్టే  అవకాశం ఉంటుంది . ఎన్నో అభివృద్ధి  పథకాలు ప్రవేశ పెట్టి అన్ని రంగాలలో మన రాష్ట్రం ముందుండాలని తపించే రాష్ట్ర ప్రభుత్వానికి మా ఈ ప్రతిపాదన స్వీకరించి అమలుపరచడం కష్టమైన పని కానేకాదని భావిస్తున్న.

                                                                              – సయ్యద్ రఫీ, దర్శకనిర్మాత

Attachments area

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.