
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నాగబాబు కూతురు నిహారిక ఎంట్రీ ఇస్తోంది.. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ తొలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిహారిక ఈ సినిమా కోసం పారితోషకం కింద దాదాపు 30 లక్షలు తీసుకుంటుందట.. ఇంత భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న తొలి హీరోయిన్ ఈమెనట.. హీరోలెవరూ ఇంతవరకు తమ తొలి సినిమాకు ఇంత మొత్తం అందుకోలేదట..
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ కావడం.. దీనికి మెగా ఫ్యామిలీ మద్దతు, అభిమానులు, ఉండడంతో ఈమెకు ఇంత మొత్తం అందిస్తున్నారట నిర్మాత.. సో తొలిసినిమాకే భారీ పారితోషకం అందుకుంటున్న ముద్దుగమ్మ నిహారిక అన్నమాట..