సిద్ధిపేట స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు

సిద్ధిపేట స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు

త్వరలో క్రీడా హబ్ గా సిద్ధిపేట.

లీగ్ మ్యాచ్ లకు అథిత్యం ఇచ్చిన ఆచార్య జయశంకర్ క్రికెట్ స్టేడియం.

సిద్దిపేట మినీ స్టేడియంలో   టీ 20- 20 క్రికెట్ మ్యాచ్ శుక్రవారం  ప్రారంభం అయ్యింది.మంత్రి హరీష్ రావు టాస్ వేశారు. సిద్దిపేటలో క్రికెట్ కోలాహలం మొదలైంది. సిద్దిపేటలో టీ20 లీగ్ మ్యాచ్ లు జరగడం పట్ల మంత్రి హర్షం వెలిబుచ్చారు.సిద్దిపేట ఇక మినీ స్టేడియం కాదని ఈ స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని హరీష్ ప్రకటించారు.ప్రత్యేకంగా ఇక్కడ ఈ లీగ్ మ్యాచ్ లు జరగడానికి కృషి చేసిన HCA కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో రెండవ వేదిక గా సిద్దిపేట స్టేడియాన్ని ఎంపిక చేసుకోవం చాలా సంతోషంగా ఉందన్నారు.స్టేడియం అభివృద్ధి చేయడానికిఇక్కడ క్రీడాకారుల్లో  ఉత్సహం కారణమని మంత్రి వ్యాఖ్యానించారు. సిద్దిపేట క్రీడకారుల్లో ఉన్న ఆసక్తి తోనే మినీ స్టేడియం అభివృద్ధి చేసామన్నారు. త్వరలో సిద్దిపేటను  క్రిడా హబ్ గా చేస్తామని హరీశ్ రావు చెప్పారు.డే అండ్ నైట్ మ్యాచ్ లు అయ్యే విధంగా 15రోజుల్లో ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.సిద్దిపేట లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా ఉండి సహకారం అందిస్తానన్నారు.అన్ని క్రీడలలోనూ సిద్దిపేట క్రీడా కారులు నైపుణ్యాలను పెంచుకోవాలని కోరారు. క్రికెట్ తో పాటు అథ్లెటిక్ లాంటి వాటిలో కూడా ముందు ఉండాలని సూచించారు. స్థానిక క్రీడా కారులు రాష్ట్ర ,జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీల్లో క్రిడా కారులు ముందు ఉండాలని అభిలషించారు.అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా స్టేడియాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.రాబోయే రోజుల్లో ఇక్కడ అంతర్జాతీయ,జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే విధంగా కృషి చేస్తానని అన్నారు.ఆస్థాయిలో సిద్దిపేట క్రీడాకారులు ఎదగాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ,క్రిడా కారులను గుర్తించేందు ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.సీఎం కేసీఆర్  కూడా క్రిడా రంగాన్ని బలోపేతం చేయడానికి మైదానాలు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.ఇంత గొప్ప అవకాశాన్ని పట్టణ ,గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సిద్దిపేటనుఅన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన్నట్టు తెలిపారు.కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ విద్యా క్షేత్రాంగా చేసుకున్నట్టు చేప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు అవుతోందని,ప్రభుత్వ ఆసుపత్రిలను మెరుగు పరుచుకొని  పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందెల కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ ,పట్టణ స్థాయి క్రీడలను ,క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీయాలని క్రిడా రంగాన్ని సిద్దిపేట స్టేడియాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నామన్నారు.మ్యాచ్ ని మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, HCA అధ్యక్షలు జి. వివేక్,  సిద్దిపేట చైర్మన్ రాజనర్స్, మున్సిపల్ కౌన్సిలర్స్. అభిమానులు ప్రత్యక్షంగా తిలకించారు.

HARISH RAO 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *