సిద్ధయ్య మృతితో సీఎం కేసీఆర్ మనస్తాపం

నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో బుల్లెట్ గాయలతో బాధపడి మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్య నిన్న మరణించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఆయనను ఆస్పత్రికెళ్లి చూశారు. వారి కుటుంబీకులను పరిశీలించారు. వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయమైన చేస్తామని ప్రకటించారు. కాగానే అంతలోనే ఆయన నిన్న సాయంత్రం మరణించారు.

siddaiah2

కాగా సిద్ధయ్య మృతితో సీఎం కేసీఆర్ మనస్తాపం చెందారు. నిన్న జరిగిన కేబినెట్ మీట్ ను కూడా రద్దు చేయాలని భావించినా.. చివరకు మంత్రులు, అధికారులు రావడంతో అన్యమనస్కంగానే సీఎం కేబినెట్ మీట్ కు హాజరై ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ఆ సమావేశంలో సీఎం ముభావంగా ఉండడం కనిపించిందని మంత్రులు, అధికారులు తెలిపారు. తెలంగాణ లో ఉగ్రవాదుల మూకల దాడి, పోలీసుల మరణం తదితర పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం కూడా కేసీఆర్ మనస్తాపానికి కారణం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *