సిద్దిపేట జిల్లా కోమటి బండలో ఐఎఎస్ ల బృందం పర్యటన

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను, అక్కడ నిర్మించిన
వాటర్ ట్యాంకులను రాష్ట్ర ఐఎఎస్ అధికారుల బృందం పరిశీలించింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ
అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పథకం పనులను క్షుణ్ణంగా పరిశీలన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తూ
గురువారం ఉదయం వారు కోమటి బండకు వచ్చారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి వారికి మిషన్ భగీరథ ద్వారా
గజ్వేల్ నియోజక వర్గంతోపాటు, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఎస్ ల బృందం
బీ.పీ.ఆచార్య, సురేష్ చంద్ర, జగదీశ్వర్, శ్రీలక్ష్మి, మహేశ్ దత్ ఎక్కా, పార్థ సారథి, ఉమర్ జలీల్, గడ ప్రత్యేక అధికారి ఎం.హన్మంతరావు,
సీఈ విజయ్ ప్రకాశ్, ఇతర శాఖలకు చెందిన అధికారులు, మెగా కంపనీ ప్రతినిధులు ఉన్నారు.

 

కోమటి బండలో ఐఎఎస్ ల బృందం పర్యటన

కోమటి బండలో ఐఎఎస్ ల బృందం పర్యటన

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *