సిద్దిపేటను శుద్దిపేటను చేసిన సంకల్పి

సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు తెలంగాణ మంత్రి హరీష్ రావు.. గతంలో సీఎం కేసీఆర్  సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటను అభివృద్దిలో నడిపించాడు. కానీ హరీష్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయి.. సిద్దిపేటను నడక నుంచి పరిగెత్తించేలా చేశారు హరీష్.. హరీష్ రావు సిద్దిపేటను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేశాడు..

గడిచిన పదేళ్లుగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉంటున్న హరీష్ అభివృద్ది పనులను నిధులను ప్రభుత్వాల నుంచి తెప్పించి అందరికీ అన్ని దక్కేలా శీఘ్రగతిన అభివృద్ది పనులు చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి సిద్దిపేట రూపురేఖలు మార్చేశాడు. భారీగా పథకాలు, నిధులు మంజూరు చేయించి సమస్యలు లేకుండా చేశాడు. చెక్ డ్యాంలు కట్టించి నీటి ఊటను సృష్టించాడు..

నిన్నటి గాంధీ జయంతి నాడు సిద్దిపేట 100శాతం మరుగుదొడ్లు కట్టిన నియోజకవర్గంగా మారి అధికారిక ప్రకటన చేయించేలా ప్రగతి సాధించాడు. స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ లు వచ్చి సిద్దిపేట సంపూర్ణ పారిశుధ్యం సాధించిన నియోజకవర్గం గా ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు సంపూర్ణ పారిశుధ్యం సాధించింది కేవలం సిద్దిపేట మాత్రమే కావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *