Breaking News

సిద్దిపేటను జిల్లా చేస్తా.. రైలు మార్గం తెస్తా..

01kcr

సిద్దిపేటను జిల్లాను చేస్తామన్నారు సీఎం కేసీఆర్. సిద్దిపేటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, వరంగల్ జిల్లా జనగాంలను కలుపుకొని సిద్దిపేటను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు.  అలాగే కరీంనగర్ కొత్తపల్లి నుంచి వేములవాడ, సిరిసిల్ల మీదుగా రైలు మార్గం తెస్తానని సిద్దిపేట ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా హరిత హారంలో ఏ నియోజకవర్గం అయితే ఎక్కువ మొక్కలు నాటుతుందో ఆ నియోజకవర్గానికి రూ.5 కోట్ల గ్రాంటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *