సిటీలో బెంబేలెత్తిస్తున్న డ్త్ర్రెవర్లు

హైదరాబాద్: హైదరాబాద్ లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు బెంబెలేత్తిస్తున్నారు. ఇష్టరాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ… ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. దీంతో రోడ్లపై వెళ్లాలంటేనే పాదచారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొన్న పాతబస్తీలో ఓ రోడ్డు పై వెళ్తున్న వ్యక్తిపై ఆటో దూసుకెళ్లగా పాదచారుడు స్పాట్ లో చనిపోయాడు. నిన్న అత్తాపూర్ లో ఓ మహిళను ఆటో ఈడ్చుకెళ్లింది. ఇలా వరుస సంఘటనలు మరువక ముందే తాజాగా బంజారాహిల్స్ లో ఓ చిన్నారిని క్యాబ్ డ్రైవర్ డీకోట్టి పారిపోయాడు. దీంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. డ్రైవర్ల తీరుపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో చెలరేగిపోతున్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు జనాలపైకి దూసుకెళ్తున్న వాహనాలు వచ్చి రాని డ్రైవింగ్ తో ప్రజల ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు సిటిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేని డ్రైవర్లు ఎందరో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు నగరంలో ప్రతి రోజు ఎదో ఒక్క ప్రాంతంలో అక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్ లో రోజుకు ఒక్కరు బలి అవుతున్నారు. కఠినంగా వ్యవహరించని ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు మోటర్ వాహనాల చట్టంలో లొసుగులు రోడ్లపై వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు. మొన్న పాతబస్తీలో ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఆటో నిన్న అత్తాపుర్ లో ఓ మహిళను ఈడ్చుకెళ్లిన ఈటో తాజాగా బంజారాహిల్స్ ఓ చిన్నారి డీకోట్టి పారిపోయిన క్యాబ్ డ్రైర్ వరుస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగర వాసులు.
ఫలితాలను ఇవ్వని రోడ్డు భద్రత వారోత్సవాలు:
హైదరాబాద్ లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తూ రోడ్లపై వెళ్లే పాదచారులపైకి దూసుకెళ్తున్నారు. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని శంషీర్‌గంజ్‌ చౌరస్తాలో ఓ ఆటో బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తుండడంతో ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయి గాలిలోకి లేచింది. అది అలాగే ఎగిరి వచ్చి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిపై పడింది. అతి వేగంతో ఆటో ఢీకొట్ట‌డంతో కొద్ది దూరం పాటూ ఆటో స‌ద‌రు వ్య‌క్తిని ఈడ్చు కెళ్ళంది. దీంతో పాదచారుడు స్పాట్ లోనే చనిపోయాడు. ఈ సంఘటన మరువక ముందే అత్తాపూర్ లో మరో సంఘటన చోటు చేసుకుంది. ఉదయం ఎనిమిది గంటలు ప్రాంతం లో అత్తాపూర్ వద్ద ఓ మహిళా ఆటో కోసం వేచివుంది .. అయితే అటువైపు వస్తున్నా ఆటోను చూసి ఆటో ఆపింది.. అయితే ఆటో డ్రైవర్ ఆటో ఆపినట్లు ఆపి ముందుకు కదలించాడు .. అయితే ఆటో ఆగింది కదా అనే ఉద్దేశం తో ఆటో ను గట్టిగా పట్టుకోవడం తో దాదాపు 200 మీటర్లు దూరం ఈడ్చుకు పోయింది .. అయితే అక్కడ స్థానికులు అడ్డగించే ప్రయత్నం చేసిన ఆటో వాలా మాత్రం అలాగే రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు .. సదురు మహిళకు తీవ్ర గాయాలు కావడం తో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు .. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు .. అయితే ఆ ఆటో కి కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేకుండా నడుపుతున్నట్లు విచారణ లో వెల్లడైంది. ఇక తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 5 లోని దేవరకోండ బస్తీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఓ క్యాబ్ డ్రైవర్ ఢీ కోట్టి పారిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చిన్నారి నాగ త్రివేణి చనిపోయింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్ చేశారు.వరుస సంఘటనలతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు జనాలను బెంబెలేత్తిస్తున్నారు. చాలా మంది డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పైనా సరైనా అవగాహన ఉండడంలేదు. డ్రైవర్లకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ టెస్ట్ తోపాటు ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ పైన పరీక్షలు పెడుతారు ఆర్టీఏ అధికారులు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో బ్రోక్కర్లు ఆర్టీఏ అధికారులతో కుమ్మక్కైయి.. ఇష్టరాజ్యంగా లైసెన్స్ లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వచ్చి రాని డ్రైవింగ్ తో రోడ్లపై వేళ్లే పాదచారుల ప్రాణాలను తీస్తున్నారు. నగరంలో ప్రతి రోజు ఎదో ఒక్క ప్రాంతంలో అక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలతో ప్రతి రోజు ఒక్కరు బలి అవుతున్నట్లు పోలీసుల రికార్డులే చెప్తున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు.. కఠినంగా వ్యవహరించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలను ఆరికట్టడంలో.. రోడ్డు భద్రత వారోత్సవాలు పేరు గోప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైయిందనే విమర్శలు విపిస్తున్నాయి. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించిన రోడ్డు ప్రమాదాలు ఆగడంలేదు. హైదరాబాద్ లో డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రతిరోజు ఎదో ఒక్కప్రాంతంలో రోడ్డు ప్రమాదాల సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. జనాలపైకి దూసుకెళ్లడంతో పాదచారులు మరణిస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని నగర వాసులు కోరుతున్నారు.సిటీలో వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో ఇకనైనా ఆర్టీఏ అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారా లేదా అన్నది చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *