Breaking News

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళీ అమ్మవారి బోనాల జాతరకు ఘనంగా ఏర్పాట్లు

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళీ అమ్మవారి బోనాల జాతరకు ఘనంగా ఏర్పాట్లు

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళీ దేవాలయంలో 6 లక్షలతో ఏర్పాటు చేసిన మాడల్ కిచన్ ను బుధవారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పోరేటర్ శ్రీమతి అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు , ఆలయ ఈఓ అన్నపూర్ణ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలు ప్రతీ పండుగను ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారని, ఈ అమ్మవారి బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అలాగే అమ్మవారికి స్వంత నిధులతో డైమండ్ తో ముక్కుపుడక, బోట్టు, ఖడ్గం, సమర్పిస్తున్నామని అలాగే 250 కిలోల వెండితో గర్భగుడికి వెండి కౌశ్యం ఏర్పాటు చేస్తామని , అమ్మవారికి తొలిసారిగా బంగారం బోనము సమర్పిస్తున్నామని అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని,బోనాల ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జియం సుదర్శన్ , స్ట్రీట్ లైట్ డీఈ మహేష్ ,ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ నరేష్ , హార్టికల్చర్ సూపర్ వైసర్ జోయెబ్ తో పాటు నాయకులు పాల్గొన్నారు.

talasani srinivase yadav 1     talasani srinivase yadav 2     talasani srinivase yadav 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *