
సికింద్రాబాద్ రైల్వేే స్టేషన్ లో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని రైల్వే శాఖ ప్రారంభించింది. సికింద్రాబాద్ తో పాటు దేశంలోని ఆరు రైల్వే స్టేషన్లలో కూడా ఈ సదుపాయం కల్పించింది. దశలవారీ గా అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని విస్తరించాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. సికింద్రాబాద్ తో పాటు ముంబై, ఆగ్రా, వారణాసి, అహ్మదాబాద్, హౌరా, రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సౌకర్యం కింద అరగంట పాటు ఇంటర్ నెట్ ను ప్రయాణికులు వాడుకోవచ్చు. ఆ తర్వాత దానికదే నిలిచిపోతుంది.
కాగా ఈ ఆరు స్టేషన్లతో పాటు తెలంగాణ, ఏపీల్లోని మరో 10 రైల్వే స్టేషన్లలో కూడా ఉచిత వైఫై అందించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కాచిగూడ, నాంపల్లి, కాజిపేట, వరంగల్, కరీంనగర్, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో కూడా వైఫై సౌకర్యం కల్పించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.