
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 69వ గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.