సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం 104 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు: మంత్రి పద్మారావు

సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం జి‌హెచ్‌ఎం‌సి ద్వారా 104 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 65 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు.  జలమండలి ద్వారా 10 కోట్ల రూపాయల వ్యయం తో పనులు జరిగాయని చెప్పారు.  శుక్రవారం రోజు సికింద్రాబాద్ లోని జి‌హెచ్‌ఎం‌సి జోనల్ కమిషనర్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ….  గతం లో ఎన్నడూ లేని విదంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు.  గత 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా వున్న తుకారంగేట్ RUB నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. దీనికోసం 30 కోట్ల నిధులను రైల్వే, జి‌హెచ్‌ఎం‌సి కలిసి కేటాయించనున్నట్టు తెలిపారు.    సుమారు 8 కోట్ల వ్యయం తో ఫంక్షన్ హాల్, సెట్విన్ భవన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.  సీతఫలమండి వెల్ఫేర్ సెంటర్ మైదానం లో అన్నీ హంగులతో కూడిన ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.  ఇదేవిదంగా అడ్డగుట్ట, లాలాపేట ప్రాంతాల్లో ముల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ల నిర్మాణాలను చెప్పట్టడానికి ప్రతిపాదనలు సిద్దం కానున్నట్లు అన్నారు. .  దీనితో పాటు మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం, సివరేజ్ లైన్లు, మంచి నీటి పైప్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.  16 కోట్ల రూపాయల వ్యయంతో ఒకేచోట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పాఠశాల భవన నిర్మాణాలను చేపడుతున్నట్టు తెలిపారు.  తన హయం లో 100 పవర్ బోర్లను వేయించడం జరిగిందని అన్నారు.  తాజాగా లాలాపేట, సీతఫలమండి ప్రాంతాల్లో అన్నీ హంగులతో కూడిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా సిద్దం చేస్తున్నట్లు చెప్పారు.   చిలకలగూడ నుండి జమై ఉస్మానియా వరకు, ఇంకా తార్నాక రహదారుల విస్తరణ పనులను త్వరగా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశం లో జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ రవి కుమార్, కార్పొరేటర్లు సామల హేమ, ఆలకుంట సరస్వతి, భార్గవి, ధనంజన గౌడ్, విజయకుమారి, సూపరింటెండెంట్ ఇంజినీర్ అశ్విన్ కుమార్, జలమండలి జనరల్ మేనేజర్ సుదర్శన్, అసిస్టెంట్ సిటి ప్లానర్ రాజేందర్, ముషీరాబాద్, మారేడ్ పల్లి తహసీల్దార్లు, వివిద శాఖల అధికారులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.