
వచ్చే శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుందని తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల హర్ష కిరణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారంనాడు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబును కలిసిన హర్ష కిరణ్ పార్టీ పటిష్టత కోసం తాము చేస్తున్న కృషిని వివరించారు .2019 ఎన్నికల్లో సికింద్రాబాద్లో టిడిపి జెండా ఎగరేస్తాం అని చంద్రబాబుకు తెలిపి మెమొంటో అందజేశారు .
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పి ఇలానే కష్టపడాలని తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని హర్ష కిరణ్ ని భుజం తట్టి అభినందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పనితీరు అద్భుతంగా ఉందని, అందుకు కృషి చేస్తున్న మేకల సారంగపాణి, మేకల హర్ష కిరణ్ , నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ,పార్టీ నాయకులను చంద్రబాబు అభినందించారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.