సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల మాదిరిగా జర్నలిస్టుల సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలలి : నగునూరి శేఖర్

తెలంగాణ రాష్ట్రం లో నిజమైన జర్నలిస్టుల సంఘము ఏదో ,ఏ సంఘానికి ఎంత మంది సభ్యుల బలం ఉందో తేల్చడానికి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల మాదిరిగా జర్నలిస్టుల సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘము రాజన్న సిరిసిల్ల జిల్లా మహా సభలో ఆయన మాట్లాడుతూ తమ సంఘానికి రాష్ట్రంలో 13 వేల మంది సభ్యులుగా ఉన్నారన్నారు. తెలంగాణ లో పని చేస్తున్న జర్నలిస్టుల అందరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. టీ యు డబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ తెలంగాణ లో జర్నలిస్టుల కోసం పోరాటం చేస్తున్న సంఘము తమదొక్కటే అన్నారు.తమ పోరాటం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. గజ్వేల్ లో జర్నలిస్టుల కు మోడల్ హౌస్ లు నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి విరహత్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మహా సభకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తాడూరు కరుణాకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అయిలు రమేష్, టీ యూ డబ్య్లు జే కరీంనగర్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రంగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు భద్రాచలం, దాసరి దేవేందర్, యూనియన్ నాయకులు కోళ్ళ శ్రీనివాస్, తడుక విశ్వనాథం, ఆర్.దేవేందర్, టీవీ నారాయణ, కంబోజ ముత్యం, కాయిత బాలు, ఈద మధుకర్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మహా సభను దాదాపు 250 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.                                     IMG-20171022-WA0194IMG-20171022-WA0185IMG-20171022-WA0190IMG-20171022-WA0123

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.