
-కేసీఆర్ కార్మికుల పక్షపాతి
-ఇచ్చిన హామీలు నెరవేర్చాం
– మాజీ ఎంపీ వివేక్
-11ఏ గనిపై టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
-హాజరైన సోమారపు సత్యనారాయణ
సింగరేణి కార్మికుల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమని, సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణతో కలిసి 11ఏ గనిపై కార్మికులను కలిశారు. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి సోమారపు సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు. సింగరేణి కార్మకుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్లు, లాభాల బోనస్ 27 శాతం చెల్లించామన్నారు. కార్మికుల చిరకాల కోరికైన కారుణ్య నియామకాలు కొనసాగిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రాకుంటే సింగరేణి కార్మకులకు అమలవుతున్న కారుణ్య ఉద్యోగాల అందకుండా పోతాయన్నారు. రాష్ట్రంలోజరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టకొని, టీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు. టీబీజీకేఎస్ నేత రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.