
-వృత్తి పన్ను వసూలు పూర్తిగా రద్దు -సీఎం కేసీఆర్ ఆదేశం
సింగరేణి కార్మికులకు పండుగల ముందట సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు.. సంస్థ ఈ సంవత్సరం పొందిన రూ.491 కోట్ల లాభాల్లో పొందిన లాభాల్లో 21 శాతం లాభాల వాటాను ప్రభుత్వం కార్మికులకు ఇవ్వడానికి ఒప్పుకొంది.. ఇందులో 103.11 కోట్లను లాభాలుగా కార్మికులు పొందనున్నారు.
ఉమ్మడి ఏపీలో 18శాతం లాభాలను పంచగా.. కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది 20 శాతానికి పెంచింది. ఈ సంవత్సరం 21 శాతానికి పెంచింది.. ఈ లాభాల కారణంగా ఒక్కో కార్మికునికి సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లాభాల వాట ఈ అక్టోబర్ 1న వారి ఖాతాల్లో జమ కానుంది.
కాగా దీంతో కార్మికుల నుంచి వృత్తి పన్ను వసూలు నిర్ణయాన్ని కేసీఆర్ ఉపసంహరించుకున్నారు.దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.