Breaking News

సింగరేణిలో ఉద్యోగాల జాతర

singreni1

-2164 ఉద్యోగాల భర్తీకి 10న నోటిఫికేషన్
-మొత్తం 5500 ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంస్థ
హైదరాబాద్, ప్రతినిధి : నవతెలంగాణ ఆవిర్భవించేందే నిధులు, నీళ్లు.. నియామకాలు.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు నిధులు, నీళ్లు కోసమైతే పోరాడారు కానీ నియామకాల జోలికి పోవడం లేదు. కానీ సింగరేణి వల్ల తెలంగాణలో తొలి కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది.

ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆశల్ని సింగరేణి నెరవేరుస్తోంది. సింగరేణిలో మొత్తం 5500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కోరిక మేరకు ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.. కాగా 5500 పోస్టుల్లో సింగరేణి డిపెండెంట్ల.. అంతర్గతంగా ఉన్న కార్మికులతో 3200 కు పైగా పోస్టులు భర్తీ కానున్నాయి. మిగిలిన 2164 పోస్టులను నిరుద్యోగ యువత కు కేటాయించారు.

సింగరేణి కొలువుల నోటిఫికేషన్ ఈనెల 10 జారీ చేస్తుండడంతో తెలంగాణ యువత సిద్ధమవుతోంది. కసరత్తులు, ఎక్సర్ సైజులు, రాతపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *