సామాన్యుడు సెగపెట్టాడు..

`-మోడీని ఇరుకున పెట్టేలా చట్టం తెచ్చిన కేజ్రీవాల్

కేజ్రీవాల్ కు ఈసారి ఫుల్ మెజార్టీ ఉంది. గతంలోలాగా ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ చట్టాలను నీరుగార్చే అవకాశం లేదు. ఎందుకంటే 70 స్థానాల్లో 67 ఆప్ పార్టీనే గెలిచింది..అందుకే ఏ చట్టమైనా చేసుకోవడానికి ఆప్ అధినేత కేజ్రీవాల్ కు అధికారం ఉంది. ఆ అధికారంతోనే ఇప్పుడు అవినీతిపై బ్రహ్మాస్త్రం అయిన లోక్ పాల్ బిల్లు ను తెచ్చాడు కేజ్రీవాల్.. ఈ సారి వ్యతిరేకించడానికి ఎవరూ లేకపోవడం బిల్లు ఆమోదం పొందడం ఖాయం..

ఈ బిల్లు ప్రకారం చట్టం వస్తే ఢిల్లీ పరిధిలోనే ఏ ప్రభుత్వ అధికారి అయిన ప్రభుత్వ ఆఫీసులో ఏ మంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాని సహా ఢిల్లీ పరిధిలోని వారందరూ చట్టం పరిధిలోకి వస్తారు. అందుకే ఈ చట్టం ముఖ్యంగా నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది.. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడి వారు అరెస్ట్ కావాల్సిందే.. దీంతో ఈ చట్టంపై కేంద్రం ఎలాగైనా ఆపాలని చూస్తోంది.

కేజ్రీవాల్ కు కళ్లెం వేయకపోతే కేంద్ర ప్రభుత్వం , కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు సామాన్యుడు తెచ్చిన చట్టం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *