Breaking News

సామాన్యుడిదే అధికారం..!

kezriwall1

కేంద్రంలో అధికారం.. 120 మంది బీజేపీ ఎంపీల మోహరింపు, కోట్లలో పారిన మద్యం, డబ్బుల ప్రవాహం.. గెలుపు సేనాని అమిత్ షా చతురత, అఖండ భారతాన్ని గెలిచిన నరేంద్రమోడీ సేనానిగా ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ.. సామాన్యుడి ముందు.. సాధారణ ఓటరు ముందు నిలవలేకపోయింది. కనీసం రెండంకెల స్థానాలు కూడా గెలుచుకోలేక చతికిలపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తక్కువ చేసి చూపిన వేళ.. ఎవరూ ఊహించని విజయాన్నిచ్చారు ఢిల్లీ ప్రజలు..

గడిచిన ఎన్నికల్లో 28 స్థానాలు మాత్రమే గెలిచి బీజేపీ తరువాత రెండో స్థానంలో నిలిచిన ఆప్ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. స్వయంగా వారణాసి నుంచి మోడీపై పోటీ చేసిన కేజ్రీ వాల్ ఓడిపోయారు. క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకునేందుకు మళ్లీ తన వ్యూహాలకు పదునుపెట్టి ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచి అఖండ విజయం సాధించారు..

అపూర్వ విజయం ఎలా సాధ్యమైంది.?
ఢిల్లీ ఎన్నికల్లో అమిత్ షా, మోడీ చేసిన అతిపెద్ద తప్పు కిరణ్ బేడిని ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా నిలపడం.. దీంతో ఢిల్లీ బీజేపీ నేతల్లో అసమ్మతి రాజ్యమేలి సొంత పార్టీ నేతలే ఓడిపోయేలా సహాయ నిరాకరణ చేశారు. ఈ పర్యావసనాల్ని ఆప్ చాలా చక్కగా ఉపయోగించుకొని లబ్ధి పొందింది. కాగా డబ్బు, మద్యం, అధికార బలంతో బీజేపీ ఢిల్లీలోని క్షేత్రస్థాయి సమస్యల్ని గాలికి వదిలేసి ఒబామా టూర్ అంటూ కోట్లు తగలేయడం కూడా ఢిల్లీ వాసుల్లో ఆగ్రహం తెప్పించింది. ఒబామా టూర్ కోసం 15 వేల సిసీ కెమెరాలు ఏర్పాటు చేసి జనం బాధలు గాలికి వదిలేయడం బీజేపీపై వ్యతిరేకతకు కారణమైంది.

ఇక ఆప్ మాత్రం గల్లీ గల్లీల్లోకి వెళ్లి ప్రజాసమస్యలు తీరుస్తామంటూ సామాన్యుల బాధలనే ఎజెండా చేసుకున్న ఆమ్ ఆద్మీ అఖండ విజయం సాధించింది. నీతిమంతులను, విద్యావంతులను, అవినీతిరహితులకు టికెట్లు ఇచ్చి రూపాయి కూడా జనాలకు పంచకుండా అవినీతి రహిత పాలన అందిస్తామంటూ ప్రజలకు హామీనిచ్చి గెలుపు సాధించింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాల లీడ్ సాధించి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసింది. ఇది ఖచ్చితంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..ప్రచార సరళి కి దక్కిన విజయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *