
తెలంగాణ శాసనసభా సమావేశాల్లో ప్రతిపక్షాలు గొంతుచించుకొని అరచి గీపెట్టినా విమర్శించినా సీఎం కేసీఆర్ అదరలేదు.. బెదరలేదు.. శాసనసభలో తన విజన్ ను రైతు ఆత్మహత్యలపై బాధను, తెలంగాణ అభివృద్ది ఎలా సాధించచ్చో వివరించారు.
ప్రతిపక్షాలు విమర్శించినా ఆయన బెదరకుండా తెలంగాణ సమాజం గురించి మాట్లాడారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ విన్నవించారు. మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కరెంట్ కష్టాలు తెలంగాణలో ఉండవని.. వచ్చే ఏప్రిల్ నుంచి ఉదయం 9 గంటలు కరెంట్ ఇస్తామని తెలిపారు. 2018 వరకు 24 గంటలు త్రిఫేజ్ కరెంట్ ఇస్తామని కేసీఆర్ శపథం చేశారు. తెలంగాణలో కరువును తరిమేద్దామని.. మూడు నాలుగు ఏళ్లలో బంగారు తెలంగాణ తెస్తామన్నారు.