సాగునీటి వినియోగం పై రైతులలో అవగాహన కల్పించాలి

కరీంనగర్: ఖరీఫ్ సీజన్ లో ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు అందిస్తున్నందున సాగునీటి వినియోగంపైన గ్రామ స్ధాయిలో రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర్ర ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. శుక్రువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయకట్టు నిర్వహణ పై కలెక్టర్లతో సమీక్షించారు. ఇరిగేషన్ ఎఇలు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, గ్రామ స్ధాయిలో రైతులతో సమావేశం అయి నీటి నిర్వహణ పై అవగాహన కల్పించాలని అన్నారు. కెన్సాల్ లో పేరుకొని ఉన్న చెట్లను ఉపాధి హమి పధకంలో తొలగించాలని అన్నారు. అన్ని కెనాల్స్ శుభ్రపరచాలని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడిక తీసినందున ఆయకట్టు పెంపొందుతుందని అన్నారు. రైతులకు అందుబాటులో ఉండాలని, టెలెండ్ వరకు నీరు అందే విధంగా ఎ.ఇ.లు, జె.ఇ.లు స్ధానికంగా ఉండి కాల్వల నిర్శహణను పర్యవేక్షించి అన్నారు. కలెక్టర్లు ప్రయోగత్మకంగా డివిజన్ లలో కొన్ని టెలెండ్ నుండి హెడ్ వరకు నీరు అందించి ప్రయోగం చేయాలని అన్నారు. దీని వలన నీరు అందరికీ అందుతుందని అన్నారు. ఎఫ్.ఎస్.ఎల్. లెవల్ మెయింటెన్ చేయాలని అన్నారు. దీని వలన నీటి వృధాను అరికట్టవచ్చని తెలిపారు. రెవెన్యూ అధికారులు రైతులకు అవగాహన కల్పించి టాక్స్ వసూలు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలలో అవగాహన కల్పించి నీటి పన్నులు వసులు చేస్తామని అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి గ్రామాలలో పర్యటించి నీటి నిర్వహణపై అవగాహన కల్పిస్తారని అన్నారు. జిల్లాలోని 800 చెరువుల గట్లపై హరితహరంలో మొక్కలు నాటడానికి అనుమతి కోరామని, కాలువలను శుభ్రపరచి రైతులకు నీరు అందే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *