Breaking News

సాగర్ జలాల కోసం ఏపీ కపట బుద్ది

sagar

నల్గొండ, ప్రతినిధి : తరతరాలుగా తెలంగాణకు జరుగుతున్న నీటి దోపిడీని ఇంకా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం మరోసారి కుటిల యత్నానికి ప్రయత్నించింది.తెలంగాణను ఏడారిని చేసి ఇన్నాల్లు దోచుకెళ్లిన నాగార్జున సాగర్ నీరు ఇక రాదేమోనన్న ఆందోళనతో ఏపీ ప్రభుత్వం సాగర్ పై పెత్తనానికి అడుగులు వేస్తోంది. నాగార్జునసాగర్ కు ఉన్న మొత్తం 26 గేట్లల్లో 13 గేట్ల నిర్వహణను తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ
రాసింది. దీంతో మళ్లీ మన నీటిని దోచుకుపోయేందుకు స్కెచ్ గీసింది.నాగార్జున సాగర్ ఎస్  ఈ కి తమకు గేట్ల కీలను అప్పగించాలని ఏపీ అధికారులు
కోరారట.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇది కాదని.. మీ ఆటలు సాగవంటూ తెలంగాణ సాగర్ ఎస్ ఈ గట్టి సంకేతాలు
పంపారట.. సాగర్ పై పెత్తనం ఎట్ట పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు..మున్ముందు కూడా సాగర్ జలాలపై ఆదిపత్యం, నీటి వివాదం పరిష్కారం అయ్యే వరకు ఇలానే వివిదాలు సృష్టించి లబ్ధిపొందాలని ఏపీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.  కాగా ఏపీ ప్రభుత్వ లేఖకు నిరసనగా టీఆర్ఎస్ నాయకులు డ్యాంపై ధర్నాకు దిగారు. ఏపీకి గేట్లను అప్పగించేది లేదని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *