సాక్షి ఎడిషన్లు జిల్లాలకు.. ఉద్యోగులు విదేశాలకు..

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది సాక్షి యాజమాన్యం.. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం.. జరగాల్సిన నష్టం ఇఫ్పటికే జరిగిపోయింది.. ఇక పోయిన క్రెడిబులిటీ అయిన దక్కించుకునేందుకు మళ్లీ యథాస్థానంలోకి రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది..

కొన్ని నెలల క్రితం సాక్షిలోకి హెచ్ ఎం టీవీ నుంచి వచ్చిన పెద్దాయన సాక్షిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఈనాడు అమలు చేస్తోందని.. ముందుగానే స్పందించి సాక్షి జిల్లాల ఎడిషన్లను ఎత్తివేసింది.. తెలంగాణలోని అన్ని జిల్లాల ఎడిషన్లను ఎత్తివేసి వరంగల్, హైదరాబాద్ ల్లో పెట్టేసింది. ఈ ఐడియా అట్టర్ ప్లాప్ అయ్యింది.. స్వంత జిల్లాల నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లడం ఇష్టం లేని సబ్ ఎడిటర్లందరూ మానేశారు. కొందరు వేరే పత్రికల్లో చేరగా.. మరికొందరు కొత్త వ్యాపారాలు పెట్టుకున్నారు. దీంతో సాక్షిలో మ్యాన్ పవర్ కొరత తీవ్రమైంది. దీంతో మళ్లీ రిక్రూట్ మెంట్ మొదలుపెట్టిన సాక్షిలో జాబ్ సెక్యూరిటీ లేదని ప్రధాన పత్రికల నుంచి ఎవరూ చేరలేదు.. దీంతో చిన్న పత్రికల నుంచి సబ్ ఎడిటర్లను తీసుకోవాల్సిన దుస్తితి సాక్షికి ఏర్పడింది.. అదలా ఉంచితే..

చేతులు కాలాక.. సాక్షి పీచేముడ్..

ఎడిషన్ల ఎత్తివేతతో మంచి మ్యాన్ పవర్ ను,  విశ్వసనీయతను  పొగొట్టుకున్న సాక్షి .. సంస్థలో ని ఉద్యోగులకు సైతం అభద్రతను పెంచింది. దీంతో సాక్షి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మళ్లీ ఎత్తివేసిన ఎడిషన్లను జిల్లాలకు తరలించే యోచనలో ఉందట.. వచ్చే నెలలో ఈ తంతు కొనసాగించాలనుకుంటోందట.. అంతేకాదు.. ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు ఎడిషన్ ఇంచార్జులను, కొత్త మంది టాలెంట్ జర్నలిస్టులను బ్యాంకాక్ టూర్లకు ప్లాన్ చేసిందట.. ఈనెలలోనే ఓ బ్యాచ్ విదేశాలకు వెళ్లోందట.. ఇవన్నీ ఉద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకేనట.. అప్పుడైనా సాక్షి బాగుపడుతుందేమో చూడాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.