Breaking News

సాక్షిలో మళ్లీ హడలిపోతున్నారట..

sakshi copy

సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కాస్త తెరిపి ఇచ్చిన సాక్షి యాజమాన్యం మళ్లీ పాత వాసనలు విడుచుకోలేదు. ఈ హఠాత్పరిణామాలు మళ్లీ సాక్షి ఉద్యోగుల్లో ఉద్యోగ అభద్రతను పెంచుతున్నాయట.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఈనాడు అమలు చేస్తుందని పొరబడి సాక్షి ఉన్న ఎడిషన్నంటిని ఎత్తివేసి తెలంగాణ లో హైదరాబాద్, వరంగల్ ఎడిషన్లను మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.. ఈ హఠాత్పరిణామంతో సాక్షిలో వరంగల్, హైదరాబాద్ వెళ్లలేక చాలా మంది జర్నలిస్టులు ఉద్యోగాలు మానేసి వేరే వేరే చూసుకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తరువాత సాక్షి మళ్లీ జిల్లాల ఎడిషన్లను పునరుద్దరించింది. కొత్త మందిని కొత్తగా సిబ్బంది , సబ్ ఎడిటర్లను,రిపోర్టర్లను నియమించుకుంది. అక్కడికి కట్ చేస్తే…

ఇప్పుడు మళ్లీ సాక్షిలో శిక్షణలంటూ కొత్త ట్రైనింగ్ మొదలైందట… గతంలో 2 ఏళ్ల కిందట ఎక్కువ జీతాలున్నవారిని ఇలానే హైదరాబాద్ లో ట్రైనింగ్ అంటూ పంపి వారి పర్ఫామెన్స్ సరిగా లేదంటూ తీసేసింది… కొంత మంది శిక్షణ తీసుకోకుండా మానేశారు కూడా.. ఇప్పుడు మళ్లీ సాక్షిలో ఇటీవల సీనియర్ సబ్ ఎడిటర్లకు శిక్షణ ఇప్పించారు. వీరిని సాగనంపుతారని కొందరు.. లేదు లేదు.. వీరికి ప్రమోషన్లు ఇచ్చి ఎడిషన్ ఇన్ చార్జులను మార్చుతారని కొందరు పుకార్లు చేశారు. ఏది ఏమైనా కొత్తగా ఇస్తున్న శిక్షణలతో మళ్లీ సాక్షిలో   సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు హడలిపోతున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *