సాక్షిలో మళ్లీ క్రమ‘శిక్ష’ణలు

sakshi-building

ట్రైనింగ్ లే ట్రైనింగ్ లు..సాక్షి ఉద్యోగులకు మరో సారి క్రమ ‘శిక్ష’ణలు మొదలయ్యాయి.. ఉద్యోగులను సాక్షి పత్రిక హైదరాబాద్ కు రప్పించి జర్నలిజం కళాశాల ఆధ్వర్యంలో శిక్షణలు ఇస్తోంది.. ఒక సారి తీసుకుంటారు.. ఒక సారి తొలగిస్తారు.. మళ్లీ తీసుకుంటారు.. ఇప్పుడు కొత్తగా మళ్లీ సబ్ ఎడిటర్లకు  శిక్షణలంటూ హైదరాబాద్ రప్పించుకొని శిక్షణలు ఇస్తున్నారట.. చాలామంది సబ్ ఎడిటర్లు వివిధ సంస్థల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వారే. కొందరు అనుభవంతో వివిధ పత్రికల్లో వచ్చినవారున్నారు. రోజు వారి పనిలో వాళ్లు చాలా నే నేర్చుకున్నారు. కానీ మళ్లీ ఉద్యోగులకు ట్రైనింగ్ ల పేర సాక్షి యాజమాన్యం వారిని ఇబ్బందులు పెడుతోంది. ఈ శిక్షణ శిబిరాల పేరిట విలువైన సంస్థ ధనంతో పాటు ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు ట్రైనింగ్ కు వెల్లిన ఉద్యోగులు తమకు మళ్లీ ఉద్యోగ భద్రత ఉందో లేదో తీసేస్తారేమోనని భయపడుతున్నారట..

ఈనాడు యాజమాన్యం కూడా ఇంతటి శిక్షణలు ఇవ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర విభజనకు పూర్వం సాక్షి రాకముందు ఈనాడు జర్నలిజం ఓ రేంజ్ లో ఉండేది కానీ సాక్షి, సూర్య, ఇతర పత్రికలు వచ్చిన తరువాత వారిలోనూ మార్పు వచ్చింది. పెద్దగా శిక్షణ ఇవ్వడం లేదు. టీవీ కి ఆరు నెలలు, పత్రికకైతే 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డెస్క్ ల్లో పడేస్తున్నారు. పీల్డ్ లో వారే నేర్చుకుంటారని సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు సాక్షి ఈనాడును మించి ప్రతి ఏడాది కొంత మందిని హైదరాబాద్ కు రప్పించుకొని వారిని రాచి రంపాన పెడుతోంది. ఉద్యోగాలు జీవితాలను ఆటాలాడుకుంటోంది.

ఓ వైపు ఎడిషన్ల ఎత్తివేత పడిపోయిన సర్క్యూలేషన్ ను పెంచుకోవాలనే ఆసక్తిని కనబరచకుండా ఎంత సేపు క్వాలిటీ అంటూ సబ్ ఎడిటర్లను ఇలా హింసించడంపై సంస్థలోని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచిస్తున్నారు. సంస్థలో సామరస్య వాతావరణం కల్పించాలని వేడుకుంటున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *