
అర్జెంటీనాలోని రహదారులపై గంటకో యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోతూనే ఉంటున్నాయి.. ఈ రోడ్డు ప్రమాదాలపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసినా ప్రమాదాలను తగ్గించలేకపోయింది.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ టేకింగ్.. ఈ ఓవర టేకింగ్ లో ముందున్న వాహనంను దాటేసే ప్రయత్నంలో ఎదురుగా వాహనాలను గమినించక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడనికి సాంసంగ్ కంపెనీ తన వినూత్న టెక్నాలజీని వాడింది.. భారీ ట్రక్కులకు వెనుక తెరలను ఏర్పాటు చేసి ముందు ఏఏ వాహనాలు వస్తున్నాయో తెలిసేలా భారీ తెరను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అర్జెంటీనాలో సాంసంగ్ చేసిన రోడ్డు ట్రక్ లకు తాకే తెరలతో ప్రమాదాల సంఖ్య కొద్దివరకు తగ్గింది.. మీరూ చూడండి పైన వీడియోలో సాంసంగ్ చేసిన ప్రయత్నం..