
కరీంనగర్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని కరీంనగర్ జిల్లా ఎస్పీ శివకుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ సీఐడీ విభాగం సహకారంతో జిల్లాలోని పోలీస్ అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకునేందుకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు సూచనలు చేశారు. సెల్ ఫోన్లు, కంపూటర్లను విరివిగా ఉపయోగించి క్రైమ్ రేటును తగ్గించవచ్చని.. నేరాగాళ్లను పట్టుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో డీసీఆర్బీ, కరీంనగర్, గోదావరిఖని డీఎస్పీలు సంజీవరావు, రామారావు, మల్లారెడ్డి, సీఐడీ నిపుణులు అలీషేక్, ఆరిఫ్ అలీఖాన్ ఎం.ఎస్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.