
హైదరాబాద్ : సల్మాన్ ఖాన్ నటించి త్వరలో విడుదల కాబోతున్న ‘బజరంగీ భైజాన్ ’ చిత్రానికి కథనందించింది నా తండ్రి విజయేంద్రప్రసాద్ కావడం నాకు గర్వకారణంగా ఉందని అన్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. గురువారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
సల్మాన్ హీరోగా భారీ వ్యయంతో రూపొందిన బజరంగీ బైజాన్ చిత్రానికి కథ విజయేంద్రప్రసాద్. ఈ సందర్భంగా బజరంగీ బైజాన్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ తో పాటు ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు.