Breaking News

సల్మాన్ ను దోషిగా నిర్దారించిన కోర్టు

article-2519037-19DE984100000578-698_468x341

ముంబై : ముంబైలో 2002లో మద్యం తాగి యాక్సిడెంట్ చేసి ఒకరి మృతికి కారణమైన కేసులో ముంబైలోని సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది.. ప్రమాద సమయంలో కారు నడిపింది సల్మాన్ ఖానే అని నిర్ధారించింది. సల్మాన్ పై నమోదైన 8 అభియోగాలు రుజువైనట్లు న్యాయమూర్తి తెలిపారు.

సెషన్స్ కోర్టు సల్మాన్ కు శిక్ష ఖరారు చేయగానే కోర్టు బోనులోనే ఉన్న సల్మాన్ కంట తడి పెట్టారు. నిశ్చేష్టుడై బోనులోనే మౌనంగా నిలుచున్నాడు. ‘మీరు చేసిన నేరానికి శిక్షపడుతుందని మీకు తెలుసా’ అని జడ్జి ప్రశ్నించగానే సల్మాన్ తలదించుకున్నారు.

కోర్టుకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అని జడ్జి సల్మాన్ ను అడిగారు. బోనులో ఉన్న సల్మాన్ కంటతడి పెట్టుకుని జడ్జివైపు చూస్తూ నిలుచుండిపోయారు. కోర్టు హాల్ లోని సల్మాన్ కుటుంబ సభ్యులు నిశ్చేష్టులై కూర్చుండిపోయారు. కాగా ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. సాయంత్రం సల్మాన్ కు శిక్ష ఎంత అనేది జడ్జిలు ఖరారు చేస్తారు. కనీసం 3 నుంచి 10 ఏళ్లోపు జైలుశిక్ష పడుతుందని న్యాయవాదులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *