సల్మాన్ కు హైకోర్టులో బెయిల్

Breaking-Salman-Khan-Convicted-Get-5-Years-Jail-Term-full-details

ముంబై : కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. కారు రూడ్ గా నడిపి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్ కు కింది కోర్టు ఐదేళ్ల జైలు శిక్షపడ్డ సంగతి తెలిసిందే.. దీనిపై హైకోర్టులో సల్మాన్ అప్పీల్ చేశారు. కాగా ఈ రోజు హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన ఐదేళ్ల తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. సెషన్స్ కోర్టులో విచారణ సరిగా జరగలేదని తేల్చింది.

ముంబై హైకోర్టు న్యాయమూర్తి తిప్పే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సల్మాన్ వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 30 వేల రూపాయల బాండ్ సమర్పించాలని.. పాస్ పోర్టు సమర్పించాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *