సర్వేల్లో ‘సర్వే’కు ఆ భాగ్యం లేదట..

00025

వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలిచే భాగ్యం అంతంతమాత్రంగానే ఉన్నాయట.. రాజయ్య అభ్యర్థిగా ఉండి ఉంటే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురయ్యేది.. రాజయ్య కోడలు ఉందంతంతో ఆయన అభ్యర్థిగా వైదొలిగాడు.  దీంతో నాన్ లోకల్ క్యాండిడేట్ సర్వేను తీసుకొచ్చి వరంగల్ నుంచి నిలబెట్టారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలను విస్మయపరిచింది.

నియోజకవర్గాల ఇన్ చార్జులందరూ సర్వేను నిలబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాలో ఒకరిని.. వరంగల్ వ్యక్తిని నిలబెడితే గట్టిగా ప్రచారం చేసేవారమని.. కానీ ఇప్పుడు సర్వే ఎంపికతో ఏ నియోజకవర్గ నేత ప్రచారం జోలికి పోవడం లేదు. మనస్ఫూర్తిగా  జనంలో తిరగడం లేదు.

రాష్ట్ర పీసీసీ నేతలు ఉత్తమ్, జానా, పొన్నాల లే కాస్తోకూస్తో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి సర్వే ఎంపికతో వరంగల్ లో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *