
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కూతురు, కుమారుడు పరాజయం చెందారు. ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. సికింద్రాబాద్ లోని పీజీ కళాశాల వద్ద ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒకటో వార్డు స్వతంత్ర అభ్యర్థి జక్కుల మహేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్‌పై విజయం సాధించారు. 2వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కేశవరెడ్డి గెలుపొందారు. మూడో వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ 600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ గెలుపొందారు.