సర్వాంగ సుందరంగా, సమగ్రాభివృద్ది దిశగా వేమలవాడ -మంత్రి కెటి రామారావు

తెలంగాణలోని ప్రముఖ దైవ క్షేత్రం వేములవాడ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్, అసెంబ్లీలో వేములవాడ టెంపుల్ డెవలరప్ మెంట్ అథారిటీ సంస్ధ సమీక్షా సమావేశాన్ని మంత్రి కెటీఆర్ నిర్వహించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ద్వారా పట్టణాభివృద్దిని సమగ్రంగా చేసేందుకు ఒక విజన్ తో ముందుకు పోవాలని అధికారులను అదేశించారు. అథారిటీల పరిథిలోకి పట్టణ పరిసర ప్రాంతాలను, ముంపు గ్రామాలను తీసుకుని వచ్చి, వాటిన్నంటిని వేములవాడ పట్టణ అభివృద్దితో అనుసంధానం చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్లో 5,10,25 సంవత్సరాలకు అందుకోవాల్సిన లక్ష్య్యాలను నిర్ధేశించుకోవాలన్నారు. రాబోయే సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్దికి, జనాభాకు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌళిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. దేవాలయ డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని తెలిపిన మంత్రి, పట్టణంలో చేపట్టే సివిల్ వర్క్స్( భవనాలు, బ్రిడ్జీలు, రోడ్ల ) లో చోళ-చాళుక్య శిల్ప కళా ఉట్టపడేలా చూడాలన్నారు. వేములవాడను ప్రణాళికా బద్దంగా అభివృద్ది చేస్తామని, మాస్టర్ ప్లాను రూపోందించడంలో భవిష్యత్తు అవసరాలను పరిశీలించాలని డిటిసిపి అధికారులకు అదేశాలు జారీ చేశారు. పట్టణంలో ప్రవేశించగానే ఒక టెంపుల్ టౌన్ కు వచ్చామనే భావన కలిగేలా సర్వంగా సుందరంగా తీర్చి దిద్ది అన్న రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్ద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని అధికారులను అదేశించారు. పట్టణంలో విస్తరించనున్న రోడ్లలతోపాటు, పట్టణంలో గ్రీనరీ పైన ప్రత్యేక శ్రధ్ద వహించాలన్నారు. గుడిచెరువులోకి మురికి నీరు రాకుండ, ఒక నాలాను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్క మురికినీటి చుక్క గుడి చెరువులోకి రావద్దని, ఈ యస్టీపి నిర్మాణానికి వేంటనే చర్యలు చేపట్టాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్టాండ్ నుంచి దేవాలయం వరకు కేబుల్ కార్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు. పట్టణంలో భక్తుల సౌకార్యార్ధం ఉచితంగా బస్సులు( సాద్యమైతే ఏలక్ర్టిక్ బస్సులను) ఏర్పాటు చేయాలని కోరారు. విటిడిఏ అభివృద్ది పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. త్వరలోనే వేములవాడలో పర్యటించి అక్కడి పనులను క్షేత్ర స్థాయితో పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఇచ్చిన ప్రత్యేక నిధులతో పట్టణంలో ఇప్పటికే పలు అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని స్థానిక యంఏల్యే చెన్నమనేని రమేష్ మంత్రికి తెలిపారు. వీటితోపాటు పట్టణంలో అగ్నిమాపక స్టేషన్, నాంపల్లి గుట్ట అభివృద్ది, శ్మశాన వాటిక పనులు మెదలయిన వాటికోసం సూమారు 43 కోట్ల నిధుల ప్రతిపాధనలను మంత్రి కెటి రామారావు అందించారు. మంత్రిగారి సూచనల మేరకు విటిడిఏ పరిథిలోకి ముంపు గ్రామాలను తీసుకువస్తామన్నారు. నాంపల్లి గుట్ట వద్ద నూతనంగా మరో ఘాట్ రోడ్డు ఏర్పాటుతోపాటు గుట్టపైన నర్సింహ స్వామి దేవాలయ అభివృద్ది వంటి పనులను ముందుకు తీసుకుపోతామని తెలిపారు.

ఈ సమావేశంలో విటిడిఏ అధికారులు, రాజన్న సిరిసిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.