కాలుష్య విధానంతో సామన్యులకే పోటు

Kejru-Traffice

దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి విప్లవాత్మక మార్పుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నాంది పలికారు.. కాలుష్యకారక దేశరాజధాని ఢిల్లీలో దాన్ని తగ్గించడమే ధ్యేయంగా సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో మొదటిరోజు బేసి సంఖ్య గల అన్ని వాహనాలు మాత్రమే రోడ్డు ఎక్కాలి.. సరి వాహనాలు ఎక్కితే భారీ జరిమానాలు, శిక్షలు ఉంటాయి.. ఇక రెండోరోజు ఈరోజు సరి సంఖ్య వాహనాలు రోడ్లపై తిరగాలి.. ఈ విధానం ముఖ్య ఉద్దేశంలో ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలుష్యం గల ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడమే..

కాగా ఈ విధానం రెండు, మూడు కార్లు ఉన్న వ్యాపారులు, ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వారివద్ద ఉన్న సరిబేసి సంఖ్యల కార్లతో రోజువారీగా పనులు చేసుకున్నారు. ఇబ్బందులు పడ్డదల్లా మామూలు జనమే.. దినసరి ఆటోవాలాలు, టాక్సీవాళ్లు పాపం రోజు గడవక ఇబ్బందిపడ్డారు. వారి సరిసంఖ్యల ఆటోలు, ట్రాలీల వాళ్లు తమ ఉపాధి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు..

కాగా ఈ విధానం తొలిరోజులు చాలా కార్లు, ఇతర వాహనాలు రోడ్డుపై ఎక్కలేదు.. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ముందురోజుతో పోల్చితే చాలా వరకు ట్రాఫిక్, కాలుష్యం తగ్గినట్టు రుజువైంది. కాగా సీఎం కేజ్రీవాల్ ఇద్దరు ఇతర మంత్రులతో కలిసి ఒకే కారులో సచివాలయానికి వచ్చి తాను సరిబేసి విధానాన్ని పాటించానని చెప్పారు. ఈ ప్రయోగం సఫలమైతే కొనసాగిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *