సమైక్యతను చాటి చెప్పిన కే.సీ.ఆర్ : పవన్ కళ్యాణ్

section8

జులై 6: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కి విజయనగరం జిల్లాకు చెందిన ఆనందసాయి అనే ఆర్టీటెక్ట్ ను నియమించి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ సమైఖ్యతను చాటుకున్నారని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగురాష్ర్టాలు, తెలుగుజాతి ఐక్యతకు మొట్టమొదటి అడుగు వేసింది కే.సీ.ఆర్ అని ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది కే.సీ.ఆర్ పెద్ద మనసుకు నిదర్శనం అని ఆయన అన్నారు. సెక్షన్8 అమలు చేసి మళ్ళి తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ర్టం సాదించుకున్న ఆనందం లేకుండా చేయకండి అని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ట సీ.ఎం లు బాధ్యతాయుతంగా వ్యవహరించి రెండు ప్రాంతాల అభివృద్దికి కృషి చేయాలన్నారు. నేటి రాజకీయాలలో నీతినిజాయితీలు లేకుండా పోయాయని, సీమాంధ్ర ఎం.పి లు వ్యాపారాలకే పరిమితం అవుతున్నారని, పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం పై సీరియస్ గా తీసుకోవాలని ఈ ఘటన పై సీ.బీ.ఐ ధర్యాప్తు చేయించాలని కోరారు. మీడియా స్వేచ్చను హరించవద్దని, దీనివల్ల వాస్తవాలు బయటకురాకుండా పోతాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు తెలంగాణ. రాష్ర్ట విడిపోకముందు తెలంగాణకు నష్టం జరిగిందని, విడిపోయాక ఆంధ్రరాష్ర్టానికి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  రెండు రాష్ర్టాల అభివృద్దికి నేతలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *