
విశాఖపట్నంలో డ్రైనేజీలో కొట్టుకుపోయిన చిన్నారి అదితి విజయనగరంలో సముద్రతీరాన శవమై కనిపించింది.. సరిగ్గా గురువారం విశాఖలోని డ్రైనేజీలో అదితి కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ముమ్మరంగా గాలించారు. సముద్రంలో కూడా బాగా వెతికారు. కానీ జాడ కనిపించలేదు.. నలాలన్నింటిని జల్లెడ పట్టారు. హెలిక్యాప్టర్లు,, అధునాతన టెక్నాలజీ సహాయంతో వెతికారు. అయినా అమ్మాయి జాడ కనిపించలేదు..
చివరకు గురువారం సాయంత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం సమీపంలో సన్ రే బీచ్ ఒడ్డుకు అదితి మృతదేహం కొట్టుకువచ్చింది.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది..
వెంటనే అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులు అమ్మాయి వేసుకున్న డ్రెస్, చెవికమ్మలు ఆధారంగా చనిపోయింది అదితి అని గుర్తించారు.దీంతో గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి.. కాగా రేవు వైజాగ్ నుంచి 50 కి.మీలు. అంటే సముద్రంలో విశాఖలో కలిసి 50 కి.మీ ల దూరంలో కొట్టుకొచ్చింది.. ఈ మరణం మిస్టరీగా ఉంది.