Breaking News

సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలు అమూల్యం

dig2

కరీంనగర్ : సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కరీంనగర్ రేంజ్ ఇన్ చార్జి డీఐజీ మల్లారెడ్డి అన్నారు. పోలీసులు సమర్ధవంతమైన సేవలు అందించడం వల్లనే శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.

 

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను డీఐజీ తనిఖీ చేశారు. పోలీసు వివిధ విభాగాల కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రిజర్వ్ విభాగం పోలీసుల గౌరవవందనం స్వీకరించి కవాతును పరిశీలించారు. పోలీసుల వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి..dig

 

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ సుబ్బారాయుడు, ఎ.ఆర్.డీఎస్పీ డి కోటేశ్వరరావు, ఎస్ బీ ఐ సతీష్ చందర్ రావు, ఇన్ స్పెక్టర్లు గంగాధర్, శశిధర్ తో పోలీసులు పాల్గొన్నారు.

dig3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *