సమాజంలో విలువల పరిరక్షణకు పత్రికలే ప్రధానం

kadiyam

వరంగల్ : సమాజంలో విలువల పరిరక్షణకు పత్రికలే ప్రధానమని.. మీడియా రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. హన్మకొండలో ప్రారంభమైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయరంగంలో ప్రజలకు ఉపయోగపడేలా వార్తలను అందించాలన్నారు. తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. పక్కా ఇళ్లు, ఆరోగ్య కార్డుల మంజూరి తదితర సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షులు సిన్హా, ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కే.శ్రీనివాస్ రెడ్డి, అమర్ నాథ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *