సమర్ధవంతమైన సేవలందించే పోలీసులకు ప్రోత్సాహకాలు అందిస్తాం

సమర్ధవంతమైన సేవలందించే పోలీసులకు ప్రోత్సాహకాలు అందిస్తాం

సమర్దవంతమైన సేవలందించే అన్ని స్ధాయిలకు చెందిన పోలీసులకు శాఖాపరంగా ప్రోత్సాహకాలను అందజేస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి అన్నారు. కమీషనరేట్ పరిధిలోని అన్ని స్ధాయిలకు చెందిన పోలీసులు అందిస్తున్న సేవలను అభినందించారు. కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో శనివారం నాడు కోర్టు కానిస్టేబుళ్ళతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ నేరస్ధులకు శిక్షలు పడేలా సాక్షులకు తగు రీతిలో కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. క్రమం తప్పకుండా సాక్షులకు కోర్టులో హజరుపరచాలని సూచించారు. కోర్టు కానిస్టేబుళ్ళు కోర్టు సిబ్బంది, అధికారులతో సత్సంబంధాలను కొనసాగించాలని చెప్పారు. కేసుల స్ధితిగతులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో 963 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. అన్ని స్ధాయిలకు చెందిన పోలీసులు సమర్దవంతంగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమయిందని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం లో కరీంనగర్ కమీషనరేట్ రాష్ట్రంలో నాల్గవ స్ధానంలో నిలిచిందని తెలిపారు. కేసుల పరిష్కారంలో సమర్ధవంతమైన సేవలందించిన పోలీసులకు రివార్డులను అందజేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి టి. అన్నపూర్ణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సురేష్, రాంరెడ్డి, ఉపేందర్, లీగల్ సెల్ ఇన్స్ పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *