సమరానికి సై.. తెలంగాణలో అవి లేకుంటా చేస్తాం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తాము సై అన్నారు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరిష్ రావు.. ప్రతిపక్షాలు కోరుకున్నంత కాలం.. తెలంగాణ రాష్ట్రంలోని ఏ సమస్యపైన అయినా ఎంత సేపయినా చర్చించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిని ఆయన ఈ సందర్బంగా కాంగ్రెస్, టీడీపీలకు సవాల్ విసిరారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన. 10 ఏళ్ల టీడీపీ పాలన వెలగబెట్టింది ఏమీ లేదని.. అందుకే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు ఆ రెండు పార్టీలే కారణమన్నారు. వారి పాలన బాగా చేసి ఉంటే ఇప్పుడిలా రైతులు చచ్చేవారు కాదన్నారు.

దోచుకోవడానికి కాంగ్రెస్ పాలించిందని.. అదే మేము రైతుల కుటుంబాలకు 6 లక్షల పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చినంక మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేశామన్నారు. అసెంబ్లీలో కరెంట్ పై చర్చ జరగకుండా కరెంటును నిరంతరం రైతులకు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఒక్కోటి చేసుకుంటూ పోతున్నామని వచ్చే 5 ఏళ్లలో తాము ఏ సమస్య తెలంగాణలో లేకుంటా చేస్తాం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.