సమగ్ర సర్వే లెక్క తప్పింది సారూ..

హైదరాబాద్, ప్రతినిధి : అనుకున్నది ఒక్కటి.. అయ్యిందొక్కటిలా తయారైంది సీఎం కేసీఆర్ పరిస్థితి. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వే లెక్క తప్పింది. అధికారుల అత్యుత్సాహం.. పర్సంటేజీలకే కొత్త అర్థాలు నేర్పింది. ఒకటికాదు రెండు కాదు ఉండాల్సిన జనాభాకంటే 14 శాతం అధిక జనాభాను లెక్కల్లో చూపింది సర్కారు.

ఎక్కువ జనాభా
జిల్లాకు కోటి రూపాయల చొప్పున,  పదికోట్లఖర్చుతో నిర్వహించిన ఫ్యామిలీల సర్వే.. గందరగోళంగా మారింది. జనాభా, ఆదాయం.. ఇళ్లు.. కులాలతోపాటు.. ఆస్తులు అప్పుల లెక్కలు ప్రకటించిన.. ప్రభుత్వం.. జనాభా.. పర్సంటేజీలో మాత్రం తప్పులో కాలేసింది.

తప్పిన లెక్క
సర్వే వివరాలను ఇవాళ బయటపెట్టిన ప్రభుత్వం.. చిన్న క్లారిటీ మిస్సైంది. రాష్ట్రంలో మొత్తం జనాభా వంద శాతంలో.. 51.08 శాతంలో బీసీలే పెద్ద సంఖ్య. ఆ తరువాత 21.50 శాతం ఓసీలు.. 17.5 శాతం.. ఎస్సీ, 9.91 శాతం ఎస్టీలు ఉండగా.. 14.46 శాతం ముస్లింలు ఇతర మైనారిటీలు ఉన్నట్లు లెక్కలు చెప్పింది ప్రభుత్వం. నిజానికి రాష్ట్రంలో ఓసీల జనాభా 5శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంటుంది.. కానీ సర్కారు చూపించిన లెక్కల్లో.. 21శాతం దాటిందని చెపుతోంది

జనాభా 114.50%…
వాస్తవానికి ఇక్కడున్న పరిస్థితి వేరు.. ప్రభుత్వం చెప్పిన లెక్కలు వేరు అసలు విషయం ఏంటంటే.. ఓసీల లిస్టులో.. ముస్లిం మైనారిటీలను కలిపి వారిని సెకండ్ పొజిషన్ లో చూపించిన సర్కార్.. మళ్లీ చివర్లోనూ ముస్లిం మైనారిటీల జనాభాను అదే లిస్టులో వేరుగా చూపించింది. ఈ మొత్తం కలిపితే.. 100 శాతం ఉండాల్సిన జనాభా 114.50 శాతానికి చేరుతుంది. అంటే మూడుకోట్ల 60 లక్ష జనాభా కాస్త సర్కారు నివేదిక లెక్కల ప్రకారం 4కోట్ల పదిలక్షలు దాటుతుంది. సమగ్ర సర్వే నివేదికలు ఇచ్చిన ప్రభుత్వం తప్పుల తడక లెక్కలతో.. కొత్త అయోమయాన్ని సృష్టించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.