Breaking News

సభ నుండి ‘దేశం’ ఎంపీల సస్పెస్షన్

సభ నుండి 'దేశం' ఎంపీల సస్పెస్షన్

రాష్ట్ర్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో ఆందోళనకు దాగిన టిడిపి ఎంపీలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ గురువారం నాడు సస్పెండ్ చేశారు. సభ సజావుగా సాగటానికా సహకరించాలని స్పీకర్ సుమిత్రా అనేకసార్లు కోరినప్పటికి దేశం ఎంపీలు మాట వినకపోవడంతో వారిని సభ నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, పార్లమెంట్ సభ్యులు మురళీ  మోహన్, గళ్లా జయదేవ్, తొట నరసింహం, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్, బుట్ట రేణుకా, జెసి దివాకర్ రెడ్డి, మాగంటి బాబు, శ్రీరాం మాల్యాద్రి, కొనకళ్ల నారాయణలు ఉన్నారు. వీరిని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్గున్నట్లు స్పీకర్ సుమిత్ర మహజన్ ప్రకటించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగు దేశం పార్టీ ఎంపీలు కేంద్రం పై పోరుకు శ్రీకారం చుట్టారు. టిడిపి ఎంపీలు ఆంద్ర రాష్ట్ర్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం పట్ల ఆ రాష్ట్ర్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *