సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లకు మంచిరోజులొస్తున్నాయ్..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయి.. ఎప్పుడో సూర్య, సాక్షి పత్రికలు వచ్చినప్పుడు వచ్చిన భూం ఇక ఆ తరువాత నమస్తే పత్రిక ప్రారంభమైనప్పుడు వచ్చింది. ఆ తరువాత దాదాపు 5 ఏళ్లకు పైగా జర్నలిస్టులు ఊసురుమనుకుంటూ ఉంటున్నారు.. మళ్లీ కొత్త పత్రికలు వస్తే భూం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు..

కానీ కేసీఆర్ దయ వల్ల ఇప్పుడు మరోసారి జర్నలిస్టులకు డిమాండ్ ఏర్పడింది.. కేసీఆర్ కొత్త జిల్లాలకు ప్రకటన వెలువడగానే అన్ని పత్రికల యాజమాన్యాలు రెడీ అయ్యాయి. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. కొత్త జిల్లాలకు అనుగుణంగా కొత్త జిల్లా ఎడిషన్లను ప్రారంభించడం దానికి అనుగుణంగా సబ్ ఎడిటర్లను తీసుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నాయి.

ఈనాడు కొన్ని కొత్త ఎడిషన్లకు శ్రీకారం చుడుతోంది. మంచిర్యాలలో ఆదిలాబాద్, మంచిర్యాల ఎడిషన్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.. ఇక మిగతా ఎడిషన్లలలోనే ప్రత్యేకం గా కొత్త జిల్లాలకు ఎడిషన్లకు నిర్మాణ పనులు చేస్తోంది..

ఇక సాక్షి సైతం కొత్తగా సబ్ ఎడిటర్లను తీసుకోకుండానే ఎడిషన్లను పెంచేందుకు రెడీ అయ్యింది. ఉన్న వాటిల్లోనే కొత్త జిల్లాల డెస్క్లు ఏర్పాటు కానున్నాయి..

ఆంధ్రజ్యోతి సైతం కొత్త జిల్లాలు, డెస్క్ ల ఏర్పాటుపై  దృష్టిపెట్టింది.. జిల్లాల ప్రకటన ఏర్పడగానే ఈ ప్రక్రియ కోసం ప్రణాళికలు రచిస్తోంది..

ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలు కొత్త సబ్ ఎడిటర్ల రిపోర్టర్ల కోసం వేట మొదలెట్టాయి.. కొత్తగా బ్యూరోలు, డెస్క్ ఇన్ చార్జులు, సబ్ ఎడిటర్లకు మంచిరోజులు రానున్నాయి. కొందరికి ప్రమోషన్లు రాబోతున్నాయి. మొత్తానికి కొత్త జిల్లాల ప్రకటనతో జర్నలిస్టులకు మంచిరోజులు, మంచి జీతాలు రాబోతున్నాయి. దీంతో మళ్లీ భూం వచ్చినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.